సాగరకన్య రీ ఎంట్రీ!
సాహస వీరుడు సాగర కన్య తో తెలుగు వారికి బాగా పరిచయమైన బాలీవుడ్ కథానాయిక శిల్పాశెట్టి. 90వ దశకంలో హిందీలో ఓ వెలుగు వెలిగింది. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాతో వివాహం అయ్యాక వెండితెరకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ 13 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి చేయబోతోంది. షబ్బీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న నికమ్మ తో బాలీవుడ్లో మెరవనుందీ పొడుగు కాళ్ల సుందరి. ఇన్నేళ్ల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇప్పటి వరకు చూడని ఓ సరికొత్త పాత్రలో నికమ్మ లో చూడబోతున్నారని శిల్ప చెప్పింది. అభిమన్యు దాసాని కీలక పాత్రలో నటిస్తున్నారు. శిల్ప తెరకు దూరమైన రియాల్టీ షోలు, యోగా వీడియోలతో బిజీగా గడిపింది.













