శేఖర్ కమ్ముల నెక్ట్స్ అదేనా?
రానా హీరోగా అరంగేట్రం చేసిన లీడర్ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ కు ఎంతో స్పెషల్. సమకాలీన రాజకీయాలను డైరెక్టర్ శేఖర్ కమ్ముల హ్యాండిల్ చేసిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటివరకు గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్ లాంటి సాఫ్ట్ సినిమాలను తీసి సెన్సిబుల్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న శేఖర్ కమ్ములలో మరో యాంగిల్ కూడా ఉందని లీడర్ సినిమా ప్రూవ్ చేసింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవకపోయినా లీడర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో పదిహేనేళ్ల నుంచి ఆడియన్స్ డిమాండ్ చేస్తుంటే శేఖర్ కమ్ములకు ఆ డిమాండ్ ఇన్నాళ్లకు చెవిన పడ్డట్టుంది. ఈ నేపథ్యంలోనే లీడర్2 కు స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట శేఖర్ కమ్ముల.
ప్రస్తుతం ధనుష్- నాగార్జునతో ముంబై బ్యాక్ డ్రాప్ లో మాఫియా స్టోరీ తెరకెక్కిస్తున్న నాగార్జున, ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఏషియన్ బ్యానర్లోనే తన తర్వాతి సినిమాను కూడా చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. రీసెంట్ గానే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. నటీనటులెవరన్నది ఇంకా ప్రకటించలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం అది లీడర్2 నే అని తెలుస్తోంది. అయితే లీడర్ సీక్వెల్ గా రానున్న లీడర్2 లో రాష్ట్ర విభజన జరిగాక వచ్చిన మార్పులను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో రానానే నటిస్తాడా ఏదా మరో కొత్త హీరోనా అన్నది తెలియాల్సి ఉంది.













