Sharwanand: 2026లో శర్వా నుంచి నాలుగు సినిమాలు

టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్(sharwanand) కూడా ఒకడు. అలాంటి టాలెంటెడ్ హీరో హిట్ అందుకుని చాలా కాలమవుతుంది. ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారి(nari nari naduma murari)తో పాటూ బైకర్(biker) అనే సినిమాలను చేస్తున్నాడు శర్వా. ఈ రెండు సినిమాలు ఎప్పుడో మొదలయ్యాయి. కొన్ని రీజన్స్ వల్ల షూటింగ్ లేటవుతూ వచ్చింది. ఇప్పుడు శర్వా వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
ఆ రెండింటిని పూర్తి చేస్తూనే రీసెంట్ గా సంపత్ నంది(sampath nandi) దర్శకత్వంలో భోగి(bhogi) అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి దాని కోసం బల్క్ లో కాల్షీట్స్ ను కేటాయించాడట. ఈ మూడు సినిమాలనూ సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి, నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో శ్రీను వైట్ల(Sreenu Vaitla) సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడట శర్వానంద్. అంతేకాదు ఈ నాలుగు సినిమాలనూ 2026లోనే రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట ఈ టాలెంటెడ్ హీరో.
నారీ నారీ నడుమ మురారి సినిమా ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్‌మెంట్ వచ్చింది. బైకర్ ను సమ్మర్ లో రిలీజ్ చేసి, భోగి మూవీని 2026 సెకండాఫ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. ఆ తర్వాత 2026 ఇయర్ ఎండింగ్ లో శ్రీను వైట్ల సినిమాను కూడా రిలీజ్ చేసి వరుస హిట్లు కొట్టాలని భావిస్తున్నాడట. చూస్తుంటే వచ్చే ఏడాదిపై శర్వా చాలానే ఆశలు పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. మరి ఈ సినిమాలైనా శర్వాకు విజయాల్ని అందిస్తాయేమో చూడాలి.