OMI: శర్వానంద్ విజనరీ బ్రాండ్ ఓంఐ (OMI), లాంచ్ చేసిన వెంకయ్య నాయుడు గారు

చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన క్రియేటివ్ ప్రయాణంలో మరో ముందడుగు వేసి, కొత్త బ్రాండ్ ఓంఐ (OMI)ని ఆవిష్కరించారు. మాజీ భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గారి సమక్షంలో లాంచ్ అయిన ఈ బ్రాండ్, శర్వానంద్ ప్రయాణంలో కొత్త దశను చూస్తోంది. కేవలం నటుడు, నిర్మాతగానో కాకుండా, ఒక విజనరీ ఆంట్రప్రెన్యూర్‌గా కూడా ముందుకు సాగుతున్నారని ఈ ఆవిష్కరణ తెలిజేస్తోంది.
ఈ పేరుకి లోతైన అర్థం ఉంది. “OM” సృష్టి మొత్తాన్నీ ప్రతిబింబించే ఆది నాదం. “I” అంటే వ్యక్తిగత స్వరూపం. ఈ రెండింటి సమన్వయమే వ్యక్తి, విశ్వం మధ్య సమతుల్యతను సూచిస్తోంది.
సాధారణ నిర్మాణ సంస్థలా కాకుండా, OMI మల్టీ డైమెన్షన్ ఫ్లాట్ ఫామ్ గా రూపుదిద్దుకుంటోంది. సినిమా, వెల్‌నెస్ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ రంగాలలో విస్తరిస్తూ క్రియేటివిటీ, ఆరోగ్యం, నిలకడైన జీవనవిధానాన్ని ముందుకు తెచ్చే లక్ష్యంతో పనిచేస్తుంది.
శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ రోజు, సెప్టెంబర్ 9, 2025, OMI తో కొత్త ప్రయాణం ఆరంభమవుతోంది. ఇది ఒక బ్రాండ్ ఆవిష్కరణ మాత్రమే కాదు – రాబోయే తరాలకు చేరుకునే ఒక విజన్.
ఈ జర్నీని ఒంటరిగా మొదలుపెడుతున్నా, కానీ సత్యం, స్పష్టత, నిజాయితీతో ముందుకు సాగుతున్నాను. OMI ద్వారా గొప్ప సంకల్పం, బాధ్యతతో అడుగులు వేస్తున్నాను.
OMI ఒక కంపెనీ మాత్రమే కాదు, సృజనాత్మకత, నిలకడ, ఐక్యతకు తోడ్పడే ఒక విజన్. ప్రేరణనిచ్చే కంటెంట్, నేచురల్ ప్రొడక్ట్స్, ఇంకా ఎప్పుడూ చెప్పని ప్రత్యేకమైన కథలు క్రియేషన్ దీని లక్ష్యం.
OMI ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, క్రియేటివ్ మైండ్స్ ని ఒకే వేదికపైకి తెచ్చి, వారికి గొంతుకనివ్వాలనుకుంటుంది. సత్యం, సమన్వయం, మానవ అనుబంధాన్ని ప్రతిబింబించే కథలు చెప్పాలనుకుంటుంది. OMI ప్రతి క్రియేటర్ కు ప్రేరణనిచ్చే, మద్దతు లభించే, విలువ కలిగిన ఒక హోమ్ కావాలని నా కోరిక.
సినిమాలు, ప్రొడక్షన్స్ మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ నిజాయి, సమగ్రతతో ఆరోగ్యం, జీవనం, నిలకడైన అభివృద్ధి వైపు కూడా OMI దృష్టి సారిస్తుంది.
OMI ..నిజాయితీ, ప్రేమ, బాధ్యతతో జీవించాలనే గుర్తు. రాబోయే తరాలకు సంరక్షణ, ఆశ, శ్రద్ధని నింపిన ప్రపంచాన్ని అందించాలనే సంకల్పం.
ఇది నా విజన్. ఇది నా బాధ్యత. ఇదే OMI.
ప్రేమతో
శర్వానంద్ మైనేని, ఫౌండర్ – OMI