అసంతృప్తితో ఆపేస్తున్న శర్వానంద్
గత కొన్ని సినిమాలుగా శర్వానంద్ కెరీర్ ఫ్లాపుల్లోనే నడుస్తుంది. తన నుంచి వచ్చిన చివరి ఆరు సినిమాల్లో ఒకే ఒక జీవితం మినహా మిగిలినవన్నీ డిజాస్టర్లే. దీంతో ప్రస్తుతం స్టోరీ సెలెక్షన్స్ లో శర్వా చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్యతో సినిమా చేస్తున్నాడు శర్వానంద్. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమవుతుండటంతో సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేశాడు. కానీ అవుట్‌పుట్ రష్ చూశాకే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేద్దమాని శర్వా చెప్పడంతో ఆగిపోయారట. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ముందు బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ ను అనుకున్నారు.
కానీ తర్వాత దాన్ని మార్చి మనమే అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ టైటిల్ విషయంలో కూడా శర్వానంద్ శాటిస్ఫైయింగ్ గా లేడని అందుకే టైటిల్ అనౌన్స్మెంట్ ను కూడా ఆపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శర్వానంద్ తన భార్య డెలివరీ కోసం యూఎస్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వచ్చాక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గురించి ఆలోచిద్దామని శర్వా చిత్ర యూనిట్‌కు చెప్పాడని టాక్.













