Sharwanand: ఏదొకటి తేల్చేయ్ శర్వా!
మార్కెట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఆడియన్స్ కు టచ్ లో ఉండే హీరోల్లో శర్వానంద్(Sharwanand) ఒకడు. అయితే ఈ మధ్య శర్వానంద్ సినిమాలకు సంబంధించిన వార్తలు బయటకు రావడం లేదు. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి యువి క్రియేషన్స్(UV Creations) నిర్మాణంలో అభిలాష్ రెడ్డి(Abhilash Reddy) దర్శకత్వంలో ఓ సినిమా.
రెండోది సామజవరగమన(Samajavaragamana) ఫేమ్ రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మిస్తోంది. రెండు సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుగుతుండటంతో ఏ సినిమా ముందు రిలీజవుతుందో చెప్పలేం. అయితే ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ ప్రస్తుతం తీవ్ర బడ్జెట్ సమస్యలను ఎదుర్కొంటుందట.
విశ్వంభర(Viswambhara) పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడంతో అఖిల్(Akhil) సినిమాను కూడా వాయిదా వేశారు. కంగువ(Kanguva) వల్ల భారీ నష్టం వాటిల్లింది. మా నాన్న సూపర్ హీరో కూడా దారుణంగా డిజాస్టర్ అయింది. వీటన్నింటి మధ్య శర్వా సినిమా నలిగిపోతుందని ఇన్సైడ్ టాక్. అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా కూడా కొన్ని కారణాల వల్ల నెమ్మదిగా షూటింగ్ జరుగుతుందని టాక్. ఏదేమైనా ఈ రెండు సినిమాల ప్రోగ్రెస్ గురించి శర్వా వీలైనంత త్వరగా ఏదొక అప్డేట్ ఇచ్చి రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంటే తప్ప తన సినిమాలు సెట్స్ పైన ఉన్న విషయం అందరికీ తెలియదు.













