సక్సెస్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్న శర్వా
వరుసగా అయిదారు ఫ్లాపుల తర్వాత శర్వానంద్ కు ఒకే ఒక జీవితం సినిమా సక్సెస్ కాస్త ఊరటనిచ్చింది. దీంతో కాస్త స్పీడ్ తగ్గించి సరైన దర్శకులను ఎంచుకోవడం మొదలుపెట్టాడు శర్వానంద్. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్గా ఓ సినిమాను చేస్తున్నాడు శర్వా. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది.
ఈ సినిమాకు జాబ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కానీ ఇంకా దీని గురించి చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ సినిమా తర్వాత రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించనున్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగే కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు శర్వా.
ఇక దీంతో పాటూ మరో సినిమాకు కూడా శర్వానంద్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. లూజర్ వెబ్ సిరీస్ తో అందరి ప్రశంసలందుకున్న అభిలాష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా మొదలు కానుంది. మొత్తానికి శర్వానంద్ తన ప్లానింగ్ తో మంచి డైరెక్టర్లను ఎంచుకుంటూ సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలని చూస్తున్నట్లు అర్థమవుతుంది.













