శర్వానంద్ కొత్త చిత్రానికి శ్రీకారం
రణరంగం, 96 రీమేక్ చిత్రాలలో నటిస్తున్న శర్వానంద్ మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. ఇటీవలే 96 రీమేక్ చిత్రీకరణలో గాయపడ్డ ఆయన త్వరగానే కోలుకుని తన 29వ చిత్రం పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీకారం పేరుతో రూపొందే ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. కిషోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు పన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టగా… ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు. ఆగస్ట్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: మిక్కీ జె.మేయర్, కళ: అవినాస్ కొల్ల, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిషోర్‌రెడ్డి.













