అది తెలుసుకోవాలంటే రణరంగం చూడాల్సిందే
ఓ కర్మాగారంలో పని చేసే సాధారణ వ్యక్తి పెద్ద వ్యవస్థలా ఎలా మారాడు? తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి రాజు ఎలా అయ్యాడు అన్నది తెలుసుకోవాలంటే రణరంగం చూడాల్సిందే అంటున్నారు సుధీర్‌వర్మ. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన చిత్రం రణరంగం. పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నారు. సీతా కల్యాణ వైభోగమే అంటూ సాగే పాటను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. మాఫియా డాన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రానికి ప్రశాంత్ పిళ్లై సంగీతం అందిస్తున్నారు.













