శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహా సముద్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్
RX 100 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ‘మహా సముద్రం’ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు.లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. అయితే ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో వరుస సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. పోటాపోటీగా విడుదల తేదీలను ప్రకటిస్తూ సినీ సందడిని తీసుకువస్తున్నారు మన హీరోలు. ‘సర్కారు వారి పాట’, ‘వకీల్ సాబ్’, ‘పుష్ప’, ‘ఎఫ్ 3’, ‘నారప్ప’, ‘వకీల్ సాబ్’, ‘కేజీఎఫ్’, ‘గని’ చిత్రాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించగా.. శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. ‘ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.
RX 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహా సముద్రం’ చిత్రం ఆగష్టు 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు హీరో సిద్ధార్థ్. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మహాసముద్రం’ ఆగస్ట్ 19న విడుదల కానున్నది. అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి వ్యక్తమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అందరిలోనూ కుతూహలాన్ని కలిగిస్తోంది.
శనివారం మహాసముద్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ పోస్టర్లో సముద్రం ఒడ్డున ఉన్న ఓ బోట్‌పై ఒకరికొకరు వీపులు చూపిస్తూ కూర్చొని సిగరెట్ తాగుతున్న ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు. ఆ పోస్టర్‌తో పాటు, “Our Sail in Theatres Begins this August 19th #MahaSamudram. Join this Voyage to witness an Epic tale of #ImmeasurableLove” అంటూ రాసుకొచ్చారు.
తొలిసారిగా ఓ అపురూపమైన ప్రేమకథను తమ బ్యానర్‌పైన అందిస్తున్నామని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. “ఇన్నేళ్లుగా మీరెందుకు ఓ లవ్ స్టోరీని నిర్మించడం లేదని ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతూ వస్తున్నారు. ఇప్పుడు మేం ఎప్పటికీ గర్వపడే ఓ అపురూపమైన, అపారమైన లవ్ యాక్షనర్‌ను అందిస్తున్నాం. 19 ఆగస్ట్ 2021న తీరాలను ఢీకొట్టడానికి ‘మహాసముద్రం’ వస్తోంది.” అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.













