శర్వానంద్ కూడా ఇప్పుడు అదే బాట..
ఈమధ్య మన కథానాయకులు రైతు సమస్యలపై పోరాడుతున్నారు. అన్నదాతల గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు. మహర్షిలో మహేష్‌బాబు, ఖైదీ నంబర్ 150లో చిరంజీవీ చేసింది అదే. ఇప్పుడు అదే శార్వనంద్ కూడా అదే బాట పట్టారు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం శ్రీకారం. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిక. కిషోర్ బి. దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అందులో పల్లెటూరి కుర్రాడిగా, ఓ యువ రైతుగా శర్వానంద్ దర్శనమిచ్చారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట మాట్లాడుతూ పల్లెటూరిలా స్వచ్ఛంగా ఉండే కథ ఇది. శర్వానంద్ పాత్ర చిత్రణ ఆకట్టుకుంటుంది. కథలో ప్రస్తావించిన విషయాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు, మిక్కీ జే.మేయర్ సంగీతం అదనపు బలం అన్నారు. రావు రమేష్, ఆమని, నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు.













