అరే… మీకు తెలిసిందా?
సాయిపల్లవితో అరే మీకు తెలిసిపోయిందా? అని శర్వానంద్ అన్నారు. ఆమెకు ఏం తెలిసింది? అంటే తనకు శర్వానంద్ ఫాలో చేస్తున్న సంగతి. కొన్నిసార్లు చూసి చూడనట్టు ఊరుకున్నా, ఒకరోజు అతని దగ్గరకు వెళ్లి ఓయ్ లేవయ్య లే. ఏంటి ఫాలో చేస్తున్నావా? అని అడిగారు. బదులుగా శర్వానంద్ అరే మీకు తెలిసిపోయిందా? అయినా మీరిలా దగ్గరకొచ్చి మాట్లాడటం ఏం బాలేదండి. ఏదో నాపాటికి నేను అర కిలోమీటరు దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే…అన్నారు. ఇదీ శర్వానంద్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న పడి పడి లేచే మనసు టీజర్లో దృశ్యం. హను రాఘవపూడి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. డిసెంబర్ 21 చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు.













