శర్వా ప్లానింగ్ సూపర్
గత కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్లతో ఫామ్ లో లేకుండా పోయిన శర్వానంద్ కు ఒకే ఒక్క జీవితం సినిమా చాలా ఊరటనిచ్చింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా ఎమోషన్స్, థ్రిల్స్ రెండూ కలగలిపిన ఈ సినిమా ఆడియన్స్ మనసుల్ని మెప్పించింది. ఆ సినిమా వచ్చి ఇప్పటికే రెండేళ్లవుతోంది. ఆ తర్వాత నుంచి శర్వా నుంచి ఇప్పటికీ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.
తొందరపడకుండా ఆలోచించి మరీ సినిమాలను ఓకే చేస్తున్న శర్వానంద్, లేటయినా సరే మంచి ప్లానింగ్ తో వెళ్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే సినిమాను చేస్తున్నాడు శర్వా. దానికి సంబంధించిన ప్రీ లుక్ గ్లింప్స్ ను శర్వా బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. హాయ్ నాన్న సినిమాలో లానే ఈ సినిమాలో కూడా చాలా స్ట్రాంగ్ చైల్డ్ సెంటిమెంట్ ఉందని ఇన్ సైడ్ టాక్. ఇది కాకుండా లూజర్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డితో యువి క్రియేషన్స్ లో ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీని కూడా శర్వా అనౌన్స్ చేశాడు. దీంతో పాటూ సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజుతో ఓ మూవీకి ఓకే చెప్పాడు. చూస్తుంటే శర్వా నుంచి ఇకపై గ్యాప్ లేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చేలా అనిపిస్తుంది.













