Sharwanand: శర్వా ఆ రిస్క్ చేస్తాడా?

ఇండస్ట్రీలో కేవలం కథల్ని మాత్రమే నమ్ముతూ ప్రయోగాలు చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) కూడా ఒకడు. ప్రస్తుతం శర్వా(Sharwa) రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి నారీ నారీ నడుమ మురారి(Nari nari naduma murari) కాగా మరోటి స్పోర్ట్స్ డ్రామా. ఈ రెండింటిలో నారీ నారీ ముందు రానుంది.
సామజవరగమన(samajavaragamana) డైరెక్టర్ రామ్ అబ్బరాజు(ram abbaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవాల్సింది కానీ ఇంకా మూవీ ఓటీటీ డీల్ పూర్తవకపోవడం వల్ల రిలీజ్ లేటవుతుందని అన్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ మూవీని సంక్రాంతి బరిలో దింపాలనుకుంటున్నారని సమాచారం. దీపావళికి మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయనుందట.
ఒకవేళ సంక్రాంతికి రావడం నిజమైతే మాత్రం శర్వానంద్ కు ఈసారి పోటీ కాస్త గట్టిగానే ఉంటుంది. ఆల్రెడీ సంక్రాంతికి మెగాస్టార్(chiranjeevi) మన శంకరవరప్రసాద్ గారు(Mana shankaravaraprasad garu), ప్రభాస్(prabhas) రాజా సాబ్(The Raja Saab), రవితేజ(Raviteja)- కిషోర్ తిరుమల(Kishore Tirumala) మూవీ, నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju) మూవీస్ బరిలో ఉన్నాయి. మరి ఇంత పోటీలో శర్వానంద్ ఆ రిస్క్ చేస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.