Sharwa38: ముంబైలో మేకోవర్ అవుతున్న శర్వా
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అభిలాష్ రెడ్డి(Abhilash Reddy) దర్శకత్వంలో మాళవిక నాయర్(Malavika Nair) హీరోయిన్ గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్, సామజవరగమన(Samajavaragamana) ఫేమ్ రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారీ(Nari Nari Naduma Murari) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలతో పాటూ శర్వానంద్, సంపత్ నంది(Sampath Nandi) తో ఓ సినిమా చేయడానికి చేతులు కలుపుతున్నాడు. 1960 బ్యాక్ డ్రాప్ లో ఓ యాక్షన్ మూవీ కోసం వీరిద్దరూ కలుస్తున్నారు. అయితే సంపత్ నంది ప్రతీ సినిమాలో తన హీరోను కొత్తగా చూపిస్తాడనే సంగతి తెలిసిందే. ఇప్పుడు శర్వానంద్ ని కూడా సంపత్ నంది కొత్తగానే ప్రెజెంట్ చేయనున్నాడట.
ఆ పని మీదే శర్వా ప్రస్తుతం ముంబైలో ఉన్నాడని, శర్వా 38(Sharwa38) కోసం అతను మేకోవర్ అవుతున్నాడని తెలుస్తోంది. దీని కోసం హకీం ఆలిమ్(Hakim Aalim), రషీద్ పట్టణం(Rasheed Pattanam) లాంటి స్టైలిస్టులు శర్వా లుక్ పై వర్క్ చేస్తున్నారని, త్వరలోనే వారు సంపత్ నంది మూవీ కోసం శర్వా లుక్ ను ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను కెకె రాధామోహన్(KK Radhamohan) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.













