నాని నో అంటే శర్వా యస్ అన్నాడా?
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కాంబో జై భీమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా ఓ కీ రోల్ చేస్తున్నాడని గత కొన్నాళ్ల క్రితం తెగ వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేనిదే చెన్నై మీడియా వర్గాల నుంచి హైదరాబాద్ వరకు న్యూస్ పాకిపోదు.
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు నాని ప్లేస్ లో శర్వానంద్ ఆ క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా అనౌన్స్ కాని ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు స్క్రిప్ట్ మాత్రమే ఫైనల్ అయింది. రజినీకాంత్ హిమాలయాల నుంచి వచ్చాక ఈ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను నిజంగానే నాని చేజార్చుకున్నాడా లేక వేరే సమస్య వల్ల నో చెప్పాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
రీజన్ ఏదైనా సరే రజినీ, అమితాబ్ నటించే సినిమాలోని ఛాన్స్ ను అయితే నాని మిస్ చేసుకున్నాడు. చెన్నై ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ముగ్గురి కాంబోలో సీన్స్ ఉండవని తెలుస్తోంది. బహుశా నాని అందుకే ఈ సినిమాకు నో చెప్పి ఉండొచ్చు. కానీ విషయం తెలియకుండా ఏదీ స్పష్టం చేసుకోలేం. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా చేస్తున్న శర్వానంద్ కు ఈ అవకాశం రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి.
ఈ సినిమాతో పాటూ శర్వా, మెగాస్టార్ చిరూ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది. సిద్దూ జొన్నలగడ్డ ప్లేస్ లో శర్వాకు ఆ ప్లేస్ ఖరారైందని గత రెండు వారాలుగా టాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి శర్వాకు రెండు పెద్ద సినిమాల్లో మంచి కీ రోల్ ఆఫర్లు బాగానే వచ్చాయి.













