స్పీడు పెంచిన శర్వా
సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న శర్వా గత రెండేళ్లుగా తన పర్సనల్ రీజన్స్ వల్ల కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ గ్యాప్ ను బ్యాలెన్స్ చేయాలని శర్వా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్ ఆ సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ఆ సినిమాకు కలెక్షన్లు రావడం లేదు. ఇదిలా ఉంటే శర్వా తర్వాతి సినిమాల గురించి ఇప్పుడు నెట్టింట డిస్కషన్స్ జరుగుతుంది. ప్రస్తుతం శర్వా చేతిలో రెండు సినిమాలున్నాయి.
ఆ రెండు సినిమాల కోసం శర్వా ఒకేసారి వర్క్ చేస్తున్నట్లు సమాచారం. అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా మరియు సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఎంటర్టైనర్ షూటింగ్స్ లో శర్వా పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలను పూర్తి చేసి మరిన్ని సినిమాలను లైన్ లో పెట్టాలని శర్వా అనుకుంటున్నాడట. మరి ఆ రెండు సినిమాలు శర్వాకు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.













