Nari Nari Naduma Murari: శర్వా ‘నారి నారి నడుమ మురారి’ జనవరి 14న విడుదల
చార్మింగ్ స్టార్ శర్వా (Swarvanand)ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ గురించి మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు.
నారి నారి నడుమ మురారి ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. ప్రీమియర్ షో సమయం – సాయంత్రం 5:49 అని మేకర్స్ ఇప్పుడు ప్రకటించారు. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజామున షోలతో ప్రారంభమవుతాయి, కానీ మొదటిసారిగా,ఈ సినిమా సాయంత్రం రిలీజ్ ని ఎంచుకుంటోంది. ముహూర్తం ఇంత త్వరగా ఖరారు కావడం టీమ్ ఖచ్చితమైన ప్లానింగ్ ని తెలియజేస్తోంది.
శర్వా గత సంక్రాంతి బ్లాక్బస్టర్లు శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా కూడా జనవరి 14న విడుదలయ్యాయి. సెలవుల సీజన్లో తీవ్రమైన పోటీ ఉన్నందున ఈ పండుగ సందర్భంగా రిలీజ్ కాస్త ఆలస్యంగా రావడం సినిమాకు బెనిఫిట్ కానుంది.
అనౌన్స్మెంట్ పోస్టర్లో శర్వా స్టైలిష్‌గా కనిపిస్తూ, కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్తో, మెడలో పూల హారంతో నిల్చున్నారు. సంయుక్త ఆవేదనతో నిండిన లుక్‌లో కనిపిస్తే, సాక్షి వైద్య స్వచ్ఛమైన చిరునవ్వుతో ఫ్రేమ్‌కి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. బ్యాక్‌డ్రాప్‌లో పూలతో అలంకరించిన సంప్రదాయ సెటప్, పచ్చని చెట్ల ఆభరణం మొత్తం పోస్టర్‌కి పండుగ వాతావరణం, అదే సమయంలో ఒక హ్యుమరస్ టచ్ ఇచ్చాయి.
ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీని జ్ఞాన శేఖర్ విఎస్, యువరాజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కథను భాను బోగవరపు రాశారు, నందు సావిరిగణ సంభాషణలు అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
టీమ్ త్వరలోనే ప్రమోషన్ల నెక్స్ట్ ఫేజ్ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. మరింత ఆకట్టుకునే అప్డేట్స్ తో అలరించబోతున్నారు.
-Varma






