Sharukh Khan: డైరెక్టర్ ను ఏడిపించిన షారుఖ్

షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) దర్శకత్వంలో రాకేష్ రోషన్(Rakesh Roshan) దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా కోయ్లా. 1997లో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. 90స్ కాలం నాటి క్లాసిక్ సినిమాగా కోయ్లా(Koyla)ను ఇప్పుడు ఆడియన్స్ ఆదరిస్తున్నారు కానీ ఆ సినిమాను నిర్మించిన రాకేష్ రోషన్ ఈ సినిమా వల్ల చాలా దారుణంగానే నష్టపోయారు.
ఈ విషయంలో రాకేష్ రోషన్ కొడుకు హృతిక్ రోషన్ స్వయంగా ఓ సందర్భంలో చెప్పగా, అనుకోకుండా ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కోయ్లా సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో తన తండ్రి ఏడవడం మొదటిసారి చూశానని హృతిక్ ఆ వీడియోలో చెప్పాడు. కోయ్లా మూవీకి తన తండ్రి సంపాదించిన మొత్తాన్ని పెట్టి నష్టపోయారని, ఆ సినిమా తర్వాత తన తండ్రి చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారని హృతిక్ తెలిపాడు.
అయితే ఈ వీడియోలో హృతిక్ ఎక్కడా షారుఖ్ పేరుని ప్రస్తావించనప్పటికీ షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ రాకేష్ రోషన్- షారుఖ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అయినప్పటికీ వారిద్దరూ కలిసి చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాపులుగానే నిలిచాయి. ఏదేమైనా కోయ్లా సినిమాతో షారుఖ్ తన డైరెక్టర్ ను ఏడిపించాడనే ముద్ర మాత్రం షారుఖ్ పై పడింది.