ప్రభాస్ కి డబ్బింగ్ చెప్తున్న శరద్ కేల్కర్ ….
ప్రభాస్ ” ఆదిపురుష్ ” సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మరోవైపు ప్రచార చిత్రాలలోనూ ఆదిపురుష్ చిత్రానికి ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాలని తగ్గించాయి కానీ పెంచలేదు అనే చెప్పాలి.
దీంతో అవసరమైతే సీన్స్ ని రీషూట్ చేసైనా ఆదిపురుష్ ని అగ్రస్థానం లో నిలబెట్టాలని దర్శకుడు ఓం రౌత్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సినిమాలోని లోపాలను సరి చేసుకునే పనిలో ఉన్నారు. ఆదిపురుష్ కోసం ఓం రౌత్ ఎంతగా శ్రమించారో చెప్పాల్సిన పనిలేదు.
ఈ సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ కూడా చాలానే కష్టపడ్డారు. రాముడి పాత్ర కోసం బాడీ లో చాలా చేంజెస్ ని చేశారు. లుక్ పరంగా చాల మార్పులని తీస్కొచ్చారు. ఇకపోతే సినిమా లో హిందీ వెర్షన్ కోసం ప్రభాస్ స్వయంగా తన పాత్రకి డబ్బింగ్ చెప్తారు అని అంతా అనుకున్నారు. కానీ , ప్రభాస్ ఆ ఛాన్స్ తీసుకోలేదు.
హిందీలో ప్రభాస్ పాత్రకి శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్తున్నారు. ” రాముడి పాత్రకి డబ్బింగ్ చెప్పే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్న, నాకు ఈ ఆఫర్ ఇచ్చిన దర్శకుడు ఓం రౌత్ కి కృతజ్ఞతలు చెప్తున్న ” అని శరద్ అన్నారు.
హిందీ వెర్షన్ కి ప్రభాస్ వాయిస్ సెట్ కాకపోవడం తోనే డైరెక్టర్ ఆ పాత్రకి శరద్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తెలుగు వెర్షన్ కి మాత్రం ప్రభాస్ యధావిధి గా తన గాత్రాన్ని అందిస్తారు.













