శంకర్ తో సై అంటున్న చిరు?
సైరా అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్రం అనంతరం శంకర్ దర్శకత్వంలో నటించేందుకు సూత్రపాయంగా అంగీకరించారని తెలుస్తోంది. చిరు- శంకర్ కలయికలో సినిమా తీయాలని చాలామంది ప్రయత్నించారు. ఇటు చిరంజీవి, అటు శంకర్ కూడా సానుకూలంగానే ఉన్నా.. కారణాంతరాల వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఈ మెగా కాంబినేషన్‌ను అల్లు అరవింద్ సెట్ చేయనున్నారని తెలుస్తోంది. శివ శంకర్ ప్రసాద్ అలియాస్ చిరంజీవి-శంకర్ సినిమా అనే ఊహే మెగాభిమానులకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. నిజంగా ఆ ప్రకటన వెలువడినప్పుడు వారి ఆనందానికి అవధులే ఉండవనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.













