శంకర్ కు ఇదే మంచి ఛాన్స్
ఇండియన్2(Indian2) రూపంలో దారుణమైన ట్రోలింగ్ చూడాల్సి వచ్చిన డైరెక్టర్ శంకర్(Shankar) కు గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా ఫలితం ఎంతో కీలకమైంది. సినిమా మొదలై చాలా కాలమైనప్పటికీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ మెగా ఫ్యాన్స్ దీన్ని ఓన్ చేసుకోవడం మొదలెట్టారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ కు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ చాలా మంది శంకర్ ఈజ్ బ్యాక్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీజర్ లోని చాలా పాజిటివ్ అంశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. శంకర్ ను నమ్మి తర్వాత ఎవరైనా సరే భారీగా ఖర్చు పెట్టాలంటే గేమ్ ఛేంజర్ ఎట్టి పరిస్థితుల్లో హిట్టవ్వాల్సిందే. దాని కోసమే శంకర్ ఎంతో కష్టపడుతున్నాడు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపు తమన్ కు ఫస్ట్ కాపీ ఇస్తే రీరికార్డింగ్ స్టార్ట్ చేస్తాడు. హడావిడి లేకుండా బెస్ట్ అవుట్ పుట్ రావాలంటే తమన్(thaman) కు ముందుగానే ఫస్ట్ కాపీ ఇవ్వాలి.
ఏదేమైనా ట్రైలర్ వస్తే కానీ గేమ్ ఛేంజర్ విషయంలో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోవు. శంకర్ సత్తా తగ్గలేదని నిరూపించుకోవడానికి ఇంత కన్నా మంచి ఛాన్స్ మళ్లీ దొరకదు. ఎలాంటి ఫాంటసీ, వీఎఫ్ఎక్స్ లేకుండా ఓ పొలిటికల్ థ్రిల్లర్ ను హ్యాండిల్ చేశాడు కాబట్టే దిల్ రాజు కూడా కంటెంట్ పై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తమిళ వెర్షన్ ను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.













