శంకర్ టార్గెట్ అదేనా?
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇండియన్2. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇండియన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఇండియన్2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటోంది.
ఎప్పుడెప్పుడు ఇండియన్2 థియేటర్లలోకి వస్తుందా అని కమల్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇండియన్ సినిమా లానే ఈ సినిమా లో కూడా అవినీతి మీద పోరాటం చేసే పాత్రలో కమల్ కనిపించనున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దిశకు రావడంతో ఇండియన్2 రిలీజ్ పై శంకర్ ఫోకస్ చేస్తున్నాడట.
ఇండియన్2 కు సమ్మర్ లో రిలీజ్ చేసి ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడట. శంకర్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా రోబో 2.0. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. శంకర్ నుంచి ఆరేళ్ల తర్వాత ఇండియన్2 సినిమా రాబోతుంది. రోబో2.0 యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కోలీవుడ్ లో మాత్రం ఇప్పటికీ హయ్యెస్ట్ కలెక్షన్ మూవీగా ఇదే ఉంది. ఆ రికార్డును ఇండియన్2తో బ్రేక్ చేయాలని శంకర్ చూస్తున్నాడు. మరోవైపు కమల్ హాసన్ కూడా విక్రమ్ తర్వాత మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. మరి ఇండియన్ 2 ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













