నవల కాపీపై శంకర్ ఆవేదన
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కు సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి, మంచి అవగాహన ఉన్నాయి. ఏదైనా పుస్తకంలోని అంశాలు ఆయనకు నచ్చితే వాటి హక్కులు కొని ఆయన సినిమాల కోసం ఆ సీన్స్ ను వాడుకుంటారు శంకర్. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట ఆయనకు వెంకటేశన్ అనే రచయిత రాసిన వీర యుగ నాయగన్ వేల్ పారి(veerayuga nayagan velpari) అనే పుస్తకం నచ్చి ఆ నవల హక్కులను కొనేశారు.
అయితే ఆ నవలలోని కీలక సన్నివేశాలను పర్మిషన్ లేకుండా కాపీ కొట్టి కొందరు పలు సినిమాల్లో వాడుకోవడంపై శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్ గా రిలీజైన ఓ మూవీ ట్రైలర్ లో కూడా ఆ నవలలోని కీలక సన్నివేశాల ఛాయలున్నట్లు శంకర్ వెల్లడించారు. క్రియేటర్ల రైట్స్ ను కాపాడాలని, ఇలా రచనల నుంచి ఎవరిష్టం వచ్చినట్లు సన్నివేశాలను దొంగిలించి సినిమాలు, సిరీస్‌ల్లో వాడుకోవడం తప్పని శంకర్ తెలిపారు.
ముందు ముందు ఇలాంటివి జరిగితే న్యాయపరమైన చర్యలు తప్పవని శంకర్ హెచ్చరించారు. ఈ ఏడాది జులైలో ఇండియన్2(Indian2) తో ఆడియన్స్ ను పలకరించిన శంకర్, ఆ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా మరో పార్ట్ కూడా రావాల్సి ఉంది. ఈ లోపు శంకర్ రామ్ చరణ్(Ram Charan)తో చేసిన గేమ్ ఛేంజర్(Game Changer) ను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ తో మంచి హిట్ అందుకుని బౌన్స్ బ్యాక్ అవాలని చూస్తున్నాడు శంకర్.













