Shambhala: క్రిస్మస్ బరిలో మరో సినిమా

టాలీవుడ్ లో సెలవులు, పండగ సీజన్లలో ఎక్కువ సినిమాలు రిలీజవుతుంటాయి. పండగ టైమ్ లో సినిమాలు రిలీజ్ చేస్తే ఆడియన్స్ ఫ్యామిలీలతో కలిసి థియేటర్లకు వచ్చే ఛాన్సుంటుందని ఆ సీజన్స్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు మేకర్స్. పండగ బరిలో సినిమాలను రిలీజ్ చేసి తమ లక్ ను టెస్ట్ చేసుకోవాలని పలువురు హీరోలు కూడా ట్రై చేస్తుంటారు.
అలా ఈ ఇయర్ పండగ బరిలో దిగి పలువురు హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, ఈ ఇయర్ లో ఒకే ఒక పండగ మిగిలి ఉంది. అదే క్రిస్మస్. 2025 క్రిస్మస్ బరిలో పలు తెలుగు సినిమాలు పోటీ పడనున్నాయి. అడివి శేష్(adivi sesh) డెకాయిట్(dacoit) వస్తుందని అందరికంటే ముందే అనౌన్స్ చేశారు. కానీ తర్వాత అది వాయిదా పడుతుందన్నారు. దీంతో విశ్వక్సేన్(viswaksen) ఫంకీ(funky), రోషన్ మేక(roshan meka) ఛాంపియన్(champion) క్రిస్మస్ కు రానున్నట్టు అనౌన్స్ చేశాయి.
ఇప్పుడు వాటితో పాటూ మరో సినిమా కూడా క్రిస్మస్ బరిలోకి దిగింది. అదే శంబాల(shambhala). ఆది సాయి కుమార్(aadi sai kumar) హీరోగా యుగంధర్ ముని(yugandhar muni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. శంబాల సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేయగా, ఈ సినిమాలో శ్వాసిక విజయ్(swasika vijay), అర్చన అయ్యర్(archana iyer), మధునందన్(madhu nandan), రవి వర్మ(ravi varma) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.