‘డ్రైవర్ రాముడు’గా షకలక శంకర్
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన శకలక శంకర్ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తూ వరుస అవకాశాలతో దూసుకెలుతున్నాడు. తాజాగా షకలక శంకర్ హీరోగా ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రైవర్ రాముడు’ అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అప్పటి చిత్రంలో ఎన్టీఆర్ లారీపై కాలు పెట్టి స్టైల్‌గా పోజిచ్చినట్లే శంకర్ కూడా పోజివ్వడం ఫన్నీగా ఉంది. రాజ్ సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ పతాకం పై మాస్టర్ రాజ్ ప్రణవ్ తేజ్ సమర్పణలో ఎమ్ ఎల్ రాజు, ఎస్ ఆర్ కిషన్ నిర్మిస్తున్నారు. పోస్టర్ కట్టుకునే విధంగా ఉండటంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది













