చివరి షెడ్యూల్ లో డ్రైవర్ రాముడు
షకలక శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డ్రైవర్ రాముడు. హర్షిత సింగ్ కథానాయిక. రాజ్ సత్య దర్శకత్వం వహిస్తున్నారు. కె.వేణుగోపాల్, ఎమ్.ఎల్.రాజు, టి.కీరత్ నిర్మాతలు. ప్రస్తుతం రంపచోడవరం, మారేడుపల్లి, దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో పతాక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో టాకీభాగం పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు. హాస్యం ప్రధానంగా, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న చిత్రమిది. శంభో శంకర తో ఆకట్టుకున్న శంకర్, డ్రైవర్ రాముడుగా మరోసారి తనదైన శైలిలో అల్లరి చేసి ప్రేక్షకుల్ని నవ్విస్తాడన్నారు నిర్మాతలు. ప్రదీప్ రావత్, నాజర్, ధన్రాజ్, మహేష్ విట్టా, కంచర పాలెం కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్వప్.













