షారుఖ్ తన అభిమానులకు సర్ ప్రైజ్
షారుఖ్ నుంచి తన అభిమానులకు సర్ప్రైజ్ అంటే ఏముంటుంది? ఆయన చేసిన చిత్రం జీరో విడుదలే కదా అనుకుంటారు. కానీ ఇప్పటికే ఆ సినిమా విడుదల తేదీని ప్రకటించేశారు. మరి ఇంకా సర్ప్రైజ్ ఏమిటి అంటారా? అతిలోక సుందరి శ్రీదేవి ఇందులో నటించడమే. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, అలియా భట్ కలిసి నటించారు. ఈ విషయమే ఇప్పటి వరకూ మనకు తెలుసు. కానీ ఇదే చిత్రంలో శ్రీదేవి కూడా నటించిందట. ఈమె అతిథి పాత్రలో కనిపించబోతుందట. ఈ చిత్రమే శ్రీదేవి చివరిగా నటించిన సినిమా కావడం విశేషం. ఈ విషయాన్ని షారుఖ్ చిత్రం విడుదలకు ముందే చెప్పకూడదని అనుకున్నారు కానీ తన అభిమానుల కోసం శ్రీదేవి నటన వెండితెరపై చివరి సారిగా చూస్తారన్న ఉద్దేశంతో వెల్లడించినట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, కాజోల్, మాధురి దీక్షిత్ వంటి స్టార్స్ అంతా నటించారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.













