డిసెంబర్లో పిజ్జా-2
విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా నటించిన తమిళ చిత్రం పురియత్ పుధీర్ ను తెలుగులో పిజ్జా-2 పేరుతో అనువదిస్తున్నారు. ఉదయ్ హర్ష, డి.వి.వెంకటేష్ నిర్మాతలు. డిసెంబర్ మొదటివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళల్ని ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో అనే అంశాన్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాం. ఓ సామాజిక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందించాం. ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో ఉత్కంఠను పంచుతుంది అన్నారు.













