టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న సీక్వెల్స్
బాహుబలి, కేజీఎఫ్ సినిమాలతో మొదలైన రెండు పార్ట్‌ల ట్రెండ్ టాలీవుడ్ లో ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉంది. దీని వల్ల నిర్మాతలకు లాభానికి లాభంతో పాటూ బోలెడు ఫ్రీ పబ్లిసిటీ, క్రేజ్ కూడా. ఇదే దారిలో నడిచిన పుష్ప ఇప్పుడు రెండో పార్ట్ షూటింగ్ జరుపుకుంటుండగా, పుష్ప2 కోసం యావత్ భారత దేశం ఎంతగానో వెయిట్ చేస్తుంది.
ముందు సినిమాను ఒక సినిమాగానే అనౌన్స్ చేయడం, తర్వాత కథను ఒక సినిమాలో చెప్పలేమని, రెండు భాగాలుగా అనౌన్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అయింది. ఈ లిస్ట్ లో తాజాగా మరో సినిమా చేరింది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాను రెండు భాగాలుగా రానుందని ఇవాళే అనౌన్స్మెంట్ వచ్చింది.
టాలీవుడ్ లో ఇలా రెండు భాగాలుగా రాబోతున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే కనిపిస్తోంది. పుష్ప2 తో మొదలుపెడితే, సలార్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దేవర ఎలాగూ లిస్ట్ లోకి చేరింది. ప్రభాస్ కల్కి కూడా రెండు భాగాలుగా వస్తుందని వార్తలొస్తున్నాయి. దాని గురించి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజీ, హరిహర వీరమల్లు కూడా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానున్నాయంటున్నారు. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కూడా రెండు పార్ట్ లు అంటున్నారు. వీటితో పాటూ డబుల్ ఇస్మార్ట్, అఖండ, స్కంద కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేసి ఉన్నాయి.













