F1: ఎఫ్1 మూవీకి సీక్వెల్
ఈ మధ్య హిట్ సినిమాలకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ ఎక్కువయ్యాయి. సినిమా హిట్ అవడం ఆలస్యం వెంటనే వాటికి సీక్వెల్స్ లేదా ప్రీక్వెల్స్ ను అనౌన్స్ చేసి ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ రాగా ఇప్పుడు మరో హిట్ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలున్నాయని ఆ చిత్ర డైరెక్టర్ వెల్లడించారు.
బ్రాడ్ పిట్(brad pit) నటించిన ఎఫ్1(F1) మూవీ ప్రపంచ వ్యాప్తంగా $1.8 బిలియన్లను అందుకుని ఈ ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్లైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. జోసెఫ్ కోసిన్స్కి(joseph kosinski) దర్శకత్వంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ మూవీ ఫార్ములా1 రేసింగ్ ఆధారంగా రూపొందగా, ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో పాటూ మంచి కలెక్షన్లను కూడా అందుకుంది.
అలాంటి సక్సెస్ఫుల్ మూవీకి సీక్వెల్ ను తీసే అవకాశముందని డైరెక్టర్ తెలిపారు. తాజాగా జరిగిన అకాడమీ గవర్నర్ అవార్డుల కార్యక్రమంలో జోసెఫ్ మాట్లాడుతూ, ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందా అని డిస్కషన్స్ చేస్తున్నామని, ఇంకా చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, ఎఫ్1 మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ ను చూశాక ఈ సీక్వెల్ ను చేయడానికి తాము చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పారు.






