యానిమల్కు సీక్వెల్ కూడా ఉంటుందా?
విజయ్ దేవరకొండతో ‘అర్జున్ రెడ్డి’ సినిమాను రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఒక్క సినిమా తో పాన్ ఇండియా దర్శకుడిగా మారి పోయాడు. అర్జున్ రెడ్డిని హిందీ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి తో వచ్చిన క్రేజ్ తో ఏకంగా రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుందని ఇప్పటికే రిలీజైన ప్రోమోలు, సాంగ్స్ చెప్పకనే చెప్తున్నాయి. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా మూడున్నర గంటలతో రానుంది. ఇంత రన్ టైమ్ అనేది చాలా పెద్ద విషయం. కానీ సినిమాపై ఉన్న నమ్మకంతోనే సందీప్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ ఉండే ఛాన్సుందని ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో సీక్వెల్ కు సంబంధించిన లీడ్ ను ఇచ్చి ఎండ్ చేయనున్నారని, ఆ తర్వాత సీక్వెల్ ను ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందరూ అనుకుంటున్నట్లు యానిమల్ హిట్ అయితే సందీప్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లడం ఖాయం.













