ఈ ఏడాది లో సీనియర్ స్టార్స్ సినిమాలు లేనట్టేనా?
కరోనా మహమ్మారి రోజు రోజుకి ఉదృతంగా వ్యాపిస్తుంది కరోనా కేసులు ఒక్క రోజులో వేలల్లో సంఖ్యలలో నమోదువ్వుతున్నాయి. సినిమా షూటింగ్లు లేక సినీ పరిశ్రమలో కార్మికులు జూనియర్ ఆర్టిస్టులు అల్లాడిపోతున్నారు. ఇక టాప్ హీరోలైతే షూటింగ్లు చెయ్యొద్దు అని ఘంటాపధంగా చెప్పేస్తున్నారు. ఇటీవల ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ రావడం హీరోలను మరింత భయపెట్టింది. 77ఏళ్ల సూపర్ స్టార్ కోలుకుంటున్నా.. ఇంకా కరోనాతో పోరాడుతూనే ఉన్నాడు. 60ప్లస్ హీరోలకు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతూన ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గుర్తించిన సీనియర్స్.. ఇంటి పట్టునే వుండాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా అందరినీ ఇబ్బంది పెడుతున్నా.. ముఖ్యంగా సీనియర్ స్టార్స్ కు మాత్రం ఎక్కువ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తోంది. కరోనా వచ్చిన తర్వాత యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత యంగ్ హీరోలు ముందుగా కెమెరా ముందుకు వచ్చినా.. సీనియర్ హీరోలు మాత్రం టైమ్ తీసుకుంటారట. పదేళ్లలోపు పిల్లలు.. 60ఏళ్లు దాటిన వాళ్లు కరోనాతో జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో సీనియర్ స్టార్స్ కరోనాతో ఎక్కువ భయపడాల్సి వస్తోంది. కరోనా ముప్పు 60ఏళ్లు పైబడిన వాళ్లకు ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో షష్టిపూర్తి చేసుకున్న సీనియర్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. షూటింగ్స్ కు పర్మీషన్ ఇచ్చిన వెంటనే ఆచార్య షూటింగ్ లో పాల్గొనాలని చిరంజీవి ఆరాటపడినా.. కరోనా ఉధృతి చూసే వెనక్కి తగ్గాడు. ఆచార్య ఇప్పట్లో మొదలు కాకపోయినా.. కరోనాపై అవగాహన కల్పించే వీడియోలతో జనాల్ని అలెర్ట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి..
చిరంజీవి అనే కాదు.. తెలుగులో సీనియర్ హీరోలందరూ 60లోకి అడుగుపెట్టిన వారే. కరోనా మహమ్మారి ఉధృతిని ముందే పసిగట్టిన బాలయ్య.. కరోనా టైమ్ లో షూటింగ్ ఏంటి నాన్సెన్స్ అంటూ.. షూటింగ్స్ పర్మీషన్ కోసం ట్రై చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఈ లెక్కన బోయపాటి సినిమా కరోనా తగ్గితే గానీ మొదలుకాదు. నాగార్జున 61లో.. వెంకటేశ్ 60లో ఉన్నాడు. కరోనా సమసిపోతేగానీ.. నారప్ప షూటింగ్ లో జాయిన్ కానని .. వెంకటేశ్ తెగేసి చెప్పేశాడట. అమితాబ్ తర్వాత ఏజ్ లో పెద్ద వాడు రజినీకాంత్. సూపర్ స్టార్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై మూవీ చేస్తున్నాడు. 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. అయితే రజినీకాంత్ ఆరోగ్యం అంతంతమాత్రమే. పరిస్థితులకు ఎదురెళ్లి షూటింగ్ పూర్తి చేయాలనుకోవడం లేదు. అదే విధంగా కమల్ హసన్ ఇండియన్ 2 షూటింగ్ కూడా మొదలైంది ఇప్పుడు వీళ్లంతా కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే కెమెరా ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నాడు రజినీ. ఈ లెక్కన అన్నాత్తై సినిమా ఇప్పట్లో రిలీజ్ కష్టమే.అయితే ఈ ఏడాది సీనియర్ స్టార్స్ సినిమాలు లేనట్టేనా!













