Akhanda2: అఖండ2లో సీనియర్ హీరోయిన్
వరుస విజయాలతో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) రీసెంట్ గా డాకు మహారాజ్(Daku Maharaj) సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో అఖండ2(Akhanda2) చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ(Akhanda)ను మించి ఇందులో సనాతన ధర్మం గురించి చూపించనున్నారట. రీసెంట్ గా మహా కుంభమేళాకు వెళ్లి మరీ అక్కడ కొన్ని సీన్స్ ను షూట్ చేసుకొచ్చారు అఖండ2 టీమ్.
మహా కుంభమేళాలో షూట్ చేసిన సీన్స్ ఆడియన్స్ కు కన్నుల పండగా ఉంటాయని, ప్రతీ సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ అఘోరి పాత్ర ఉంటుందట. ఆ క్యారెక్టర్ కోసం బోయపాటి ఎంతో మంది సీనియర్ హీరోయన్లని పరిశీలించి ఆఖరికి శోభన(Sobhana)ను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.
రీసెంట్ గా కల్కి(Kalki) సినిమాలో శోభన కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటే తప్ప ఏ సినిమానూ ఒప్పుకోవం లేదు. అఖండ2లో బోయపాటి చెప్పిన పాత్ర ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకి వచ్చే అవకాశముంది. అఖండ2 సెప్టెంబర్ లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.













