సీనియర్ బిగ్ స్టార్స్ సినిమాల షూటింగులు మళ్ళీ పట్టాలకెక్కాయి
లాక్డౌన్ పరిస్థితుల కారణంగా సుమారు ఏడు నెలలు పాటు తాత్కాలికంగా సీనియర్ హీరోల సినిమాలు షూటింగ్ లు ఆగిపోయాయి. లాక్డౌన్ నుంచి షడలింపులు ఇస్తూ వచ్చిన ప్రభుత్వం షూటింగ్‌కు కూడా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇన్నాళ్లు చిరంజీవి, బాల కృష్ణ, నాగార్జున, మరియు వెంకటేష్ లు మేక్ అప్ వేసుకోలేదు ఒక్క నాగార్జున మాత్రం ‘బిగ్ బాస్’ వైల్డ్ డాగ్ షూటింగ్లలో పాల్గొన్నారు.
‘ఆచార్య’ షూటింగ్: ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ తిరిగి మొదలుపెట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పినట్టు సమాచారం. వచ్చే నెల నుంచి చిరంజీవి చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. కొన్ని నెలల ముందు ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. లాక్డౌన్ నుంచి షడలింపులు ఇస్తూ వచ్చిన ప్రభుత్వం షూటింగ్‌కు కూడా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్లు షూటింగ్‌లు ప్రారంభించినప్పటికీ చిరంజీవి మాత్రం తన సినిమా షూటింగ్‌ను ప్రారంభించడానికి ఆసక్తి చూపలేదు. కరోనా మహమ్మారి ఇంకా ప్రజల్లోనే ఉన్న కారణంగా తన యూనిట్ సభ్యులకు ఎలాంటి హాని కలగకూడదనే ఉద్దేశంతో చిరంజీవి షూటింగ్‌ను ప్రారంభించలేదు. చిరంజీవి నిర్ణయం వల్ల సినిమా ఇంకా ఆలస్యమవుతుందని ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు.అయితే, చిరంజీవి ఇప్పుడు అభిమానులకు శుభవార్త చెప్పారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం. ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొనడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. నవంబర్ మూడో వారం నుంచి చిరంజీవి షూటింగ్లో పాల్గొంటారు. అంతకన్నా ముందు ఇతర నటీనటులతో కొరటాల శివ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. చిరంజీవితో షూటింగ్ మొదలుకాగానే రామ్ చరణ్ కాంబినేషన్లో కూడా సీన్స్ షూట్ చేస్తారని సమాచారం.
#బి బి 3: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కూడా లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. అయితే ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 29 నుండి హైదరాబాద్ లో పునః ప్రారంభం అవుతుందని సమాచారం ఈ షూటింగ్ లో బాలయ్య కూడా పాల్గొంటారని తెలిసింది.
నారప్ప : వైవిధ్యభరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విక్టరీ వెంకటేష్ మరోసారి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేయడానికి తమిళ ‘అసురన్’.. తెలుగులో ‘నారప్ప’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్.. తమిళ్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన అసురన్ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సురేష్ బాబు కలైపులి దాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. ప్రభుత్వం షూటింగ్‌కు కూడా అనుమతులు ఇచ్చినా కూడా ఇప్పటివరకు షెడ్యూల్ డీటెయిల్స్ ఎక్కడ ప్రకటించలేదు.
వైల్డ్ డాగ్ : అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న సుందర ప్రదేశాల్లో ఇటీవలే మొదలైంది. నాగార్జున షూటింగ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అవడమే కాకుండా అక్కడి షూటింగ్ విశేషాలు తెలుపుప్తు ఓ వీడియో సందేశాన్ని మీడియా కు పంపించారు.













