“బీ ద రియల్ మ్యాన్” ఏ ఛాలెంజ్ అయినా మా గ్యాంగ్ లీడర్ తరువాతే!
లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న టాలీవుడ్ హీరోలు,దర్శకులు, సంగీత దర్శకులందరూ ఇప్పుడు *బీ ద రియల్ మ్యాన్* ఛాలెంజ్‌లో బిజీ అయిపోయారు. ఇంటి పనులు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరొకరికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఇల్లు శుభ్రం చేస్తూ…బయట వున్నా చెత్త చెదారం తుడిచేస్తూ అంట్లు తోముతూ మరికొందరు.. బట్టలు ఉతుకుతూ ఇంకొందరు.. మరి కొందరు వంటా వార్పు చేస్తూ ఇలా అన్నిరకాల ఇంటిపనులను స్వయంగా చేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు ఇంటిపనులు చేస్తూ.. మిగతావారికి ఛాలెంజ్ విసురుతున్నారు.
తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ ఇంటిపనులన్నీ చేసి *మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం అంటూ బాలయ్యకు, చిరంజీవికి, వెంకటేశ్‌కు, కొరటాల శివకు ఛాలెంజ్ విసిరాడు. ఆల్రెడీ కొరటాల శివ ఈ రోజు ఛాలంజ్ ని స్వీకరించి ఇంటి పని అంట్లు తోమడంవంటివి చేసాడు అయితే.. దీనిపై హీరో వెంకటేశ్ వెంటనే స్పందించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. అయితే.. ఇక్కడో మెలిక పెట్టాడు. మా గ్యాంగ్ లీడర్ చిరంజీవి వీడియో కోసం ఎదురు చూస్తున్నానంటూ ట్వి్ట్టర్ పేర్కొన్నాడు. అంటే.. చిరు ఇంటి పనులు చేసి వీడియోను షేర్ చేసిన తర్వాత వెంకటేశ్ చేస్తాడన్నమాట..! మరి గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి..













