Peddi: పెద్ది కోసం చిరంజీవి హీరోయిన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది(peddi). బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్(janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న పెద్ది మూవీని వృద్ధి సినిమాస్(Vriddhi cinemas), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings), మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.
పెద్ది మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తైంది. ఈ మూవీ కోసం బుచ్చిబాబు ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా ఎంతో కష్టపడుతూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెద్దిని నెక్ట్స్ లెవెల్ లో తీయాలని ప్లాన్ చేసిన బుచ్చిబాబు అందులో భాగంగానే పలు ఇండస్ట్రీల నుంచి పలువురు నటీనటులను ఇందులో నటింపచేస్తున్నారు.
ఆల్రెడీ ఈ సినిమా కోసం శివ రాజ్‌కుమార్(siva rajkumar), దివ్యేందు శర్మ(Divyendhu sharma), జగపతి బాబు(Jagapathi babu)లను ఎంపిక చేసిన బుచ్చిబాబు, ఇప్పుడు సీనియర్ నటి శోభన(sobhana)ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి(chiranjeevi)తో కలిసి రుద్రవీణ(Rudraveena), రౌడీ అల్లుడు(Rowdy alludu) లాంటి సినిమాల్లో నటించిన శోభన, ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని తెలిసినప్పటి నుంచి పెద్దిలో ఆమె పాత్ర ఎలా ఉంటుందోనని చూడ్డానికి ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.







