Raasi: నెట్టింట వైరల్ అవుతున్న సీనియర్ హీరోయిన్ లవ్ స్టోరీ

చైల్డ్ ఆర్టిస్టు గా కెరీర్ ను మొదలుపెట్టిన రాశీ(raasi) ఆ తర్వాత హీరోయిన్ గా మారి పలు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. 90స్ టైమ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాశీ ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ తన లవ్ స్టోరీని రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా రాశీ తన పర్సనల్ విషయాలను చాలా వరకు సీక్రెట్ గా ఉంచుతారు.
కానీ మొదటిసారి తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టారామె. రాజేందప్రసాద్(Rajendra Prasad) తో తాను ఓ సినిమా చేస్తున్నప్పుడు తనకు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్(Srinivas) తో పరిచయం ఏర్పడిందని, షూటింగ్ టైమ్ లో శ్రీమంతం సీన్ జరుగుతున్నప్పడు అతను అది చూసి ఏడ్చాడని, అతన్ని చూసి ఏడ్చే అబ్బాయిలు చాలా సెన్సిటివ్ అనిపించిందని రాశీ చెప్పారు.
అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని, సెట్స్ లో అతన్ని బాగా టీజ్ చేసేదాన్నని, అలా ఓ రోజు ఎక్కువగా ఏడ్పించడంతో సారీ చెప్దాం అని నెంబర్ తీసుకుని ఫోన్ చేసి నన్ను పెళ్లిచేసుకుంటారా అని అడిగానని, అది జోక్ అనుకుని ఓకే చెప్పారని, కానీ తర్వాత మళ్లీ కలిసినప్పుడు అడిగితే నిజంగా అన్నారా అని షాకరయ్యారని రాశీ చెప్పారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది.