మరో సౌత్ సినిమా రీమేక్ కి సిద్ధమవుతున్న బాలీవుడ్…
మలయాళంలో ఒక రేంజ్ లో సూపర్ హిట్ అయిన సినిమా “డ్రైవింగ్ లైసెన్స్” . ప్రస్తుతం ఈ సినిమాని ఇతర భాషలలో రీమేక్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి ఈ సినిమాని రీమేక్ చేయడానికి ఆసక్తి చుపిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ తరహాలోనే టాలీవుడ్ లో రామ్ చరణ్ కూడా “డ్రైవింగ్ లైసెన్స్” మూవీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారని తెలుస్తుంది. అయితే తెలుగులో మాత్రం ఈ మూవీని ఎవరు రీమేక్ చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. “సెల్ఫీ” అనే టైటిల్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో గ్యాప్ లేకుండా అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరో ఎవరు అంటే అక్షయ్ కుమార్ అని చెప్పాలి. గత ఏడాది అక్షయ్ కుమార్ నుంచి ఏకంగా 6 సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం విశేషం.
ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సినిమాలని అక్షయ్ కుమార్ లైన్ లో పెట్టాడు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఏకంగా అరడజను సినిమాలు పైగా ఉన్నాయి. వాటిలో ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. అందులో డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సెల్ఫీ మూవీ కూడా ఒకటి. సెల్ఫీ ని ఫిబ్రవరి 24న రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ గ్రూప్ సొంతం చేసుకుంది. భారీ ధరకి రైట్స్ ని స్టార్ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలో ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడంతో పాటు ప్రమోషన్ పైన కూడా అక్షయ్ కుమార్ దృష్టి పెట్టబోతున్నాడని తెలుస్తుంది. మరి మలయాళం లో సూపర్ హిట్టు కొట్టిన ఈ సినిమా హిందీలో ఎంత వరకు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి.













