Sekhar Master: ఆ వార్తలు విని ఎంతో బాధపడ్డా
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(sekhar master) గురించి అందరికీ తెలుసు. రీసెంట్ గా ఆయన కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ లోని హుక్ స్టెప్స్ వల్ల సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చాడు.
ఓ మహిళా డ్యాన్సర్ కు, తనకు మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ తననెంతో బాధించాయని, నిజానిజాలు తెలుసుకోకుండా అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని ప్రశ్నించిన శేఖర్ మాస్టర్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాను జడ్జిగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ షో లో తాను ఓ పార్టిసిపెంట్ మాత్రమేనని, ఆమెకు టాలెంట్ ఉందని, అందుకే ఎంకరేజ్ చేశానని అన్నారు.
షో తర్వాత ఆమె ఎవరో కూడా తనకు తెలియదని చెప్పిన శేఖర్ మాస్టర్ తనకు ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ తో పడదని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, తనకు ఇండస్ట్రీలోని అందరితో సత్సంబంధాలున్నాయని, అందరం కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని, బయటివాళ్లు తెలియక తమ మధ్య గొడవలున్నాయనుకుంటున్నారని చెప్పాడు శేఖర్ మాస్టర్.






