Dhanush: ధనుష్ మాటలకు షాకైన కమ్ముల
శేఖర్ కమ్ముల(Sekhar Kammula), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసినప్పుడు మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రేమ కథలు, సెన్సిటివ్ సినిమాలు తీసే కమ్ముల, డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేసే ధనుష్ తో సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కుబేర(Kubera) సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
ఆ పాత్ర గురించి ధనుష్ కు చెప్పాలనుకున్నప్పుడు మొదట్లో చాలా ఇబ్బంది పడ్డట్టు దర్శకుడు శేఖర్ కమ్ముల రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కుబేర స్టోరీ చెప్పడానికి ధనుష్ కు ఫోన్ చేసినప్పుడు ఆయన తనని ఆశ్చర్యపరిచినట్టు ధనుష్ తెలిపాడు. ఫోన్ చేసే ముందు అసలు కథ ఎలా చెప్పాలి? తనెవరో ధనుష్ కు తెలుసా లేదా అనే అనుమానంతోనే కమ్ముల ఫోన్ చేశారట.
కానీ ధనుష్ కు ఫోన్ చేయగానే తాను తీసిన సినిమాల్లో ఫేవరెట్ సినిమాలు, వాటిలోని సీన్స్ గురించి మాట్లాడటం విని తను షాక్ అయ్యానని, ధనుష్ లాంటి మంచి యాక్టర్ తో పని చేయడం తనకు చాలా గొప్ప అనుభవమని కమ్ముల తెలిపాడు. ఈ సినిమాలో ధనుష్ తో పాటూ టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.













