అదే ఫార్ములాని ఫాలో అవుతున్న కమ్ముల
సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరున్నప్పటికీ శేఖర్ కమ్ముల సీరియస్ సబ్జెక్ట్స్ టచ్ చేస్తే మాత్రం వాటి అవుట్పుట్ ఎలా ఉంటుందనేది లీడర్ సినిమాతోనే తేలిపోయింది. లీడర్ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయినా సమకాలీన రాజకీయ అంశాలను అందులో చూపించిన తీరు లీడర్ ను మంచి క్లాసిక్ గా మార్చేసింది. ఆ సినిమాలో రానా రూలింగ్ పార్టీ మంత్రులకు వందల సంఖ్యలో ఉన్న డబ్బుల కట్టలను ఇచ్చే సీన్ బాగా పేలింది.
ఆ సినిమా వచ్చిన టైమ్ లో నిజంగా ఇలా జరుగుతుందా అనే కామెంట్స్ బాగానే వినిపించాయి కానీ ఇప్పుడదే నిజమైంది. అయితే ఇప్పుడు తాజాగా శేఖర్ కమ్ముల కుబేర సినిమాలో కూడా అదే ఫార్ములా వాడబోతున్నట్లనిపిస్తుంది. రీసెంట్ గా కుబేర నుంచి రిలీజ్ చేసిన నాగ్ ఫస్ట్ లుక్ టీజర్ లో ఓ కంటైనర్ నిండుగా డబ్బుంటే నాగ్ అది చూస్తూ వర్షంలో గొడుగు పట్టుకుని నిల్చుంటాడు.
నాగ్ పాత్ర గురించి టీజర్ లో ఎలాంటి క్లూ ఇవ్వకపోయినా ఇంటెలిజెన్స్ పాత్రలో నాగ్ ఈ సినిమాలో కనిపించనున్నాడని తెలుస్తోంది చిల్లిగవ్వ కూడా లేకుండా తిరిగి లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారే ధనుష్ చీకటి రహస్యాలను బయటకు తీసే అధికారిగా నాగ్ ను కొత్తగా చూపించనున్నాడట శేఖర్ కమ్ముల. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయని ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. మరి కుబేర ఏ డేట్ ను ఫిక్స్ చేసుకుంటాడో చూడాలి.













