Kubera: కుబేర విషయంలో రాజీ పడని డైరెక్టర్
ధనుష్(Dhanush) ప్రధాన పాత్రలో, నాగార్జున(Nagarjuna) కీలక పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా కుబేర(Kubera). ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. దానికి కారణం డైరెక్టరేనని తెలుస్తోంది. ప్రతీ సన్నివేశం పర్ఫెక్ట్ గా రావాలని శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఎంతో జాగ్రత్తగా కుబేరను తెరకెక్కిస్తున్నాడట. తను పూర్తిగా సంతృప్తి చెందేవరకు కమ్ముల తర్వాతి సీన్ కు కూడా వెళ్లట్లేదని యూనిట్ సభ్యులంటున్నారు.
ఈ కారణంతో షూటింగ్ లేటవుతున్నప్పటికీ ఎలాంటి కాంప్రమైజ్ అవకుండా ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటున్నాడట. సినిమాలో ధనుష్ బిచ్చగాడు పాత్రలో కనిపించనుండగా, నాగార్జున సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉంటాయని చెప్తున్నారు.
భారీ బడ్జెట్ తో నిర్మాతలు ఈ సినిమాను రూపొందిస్తుండగా, రష్మిక(Rashmika) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే నా సామిరంగ(Naa Samiranga) మూవీ తర్వాత నాగార్జున నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అక్కినేని ఫ్యాన్స్ కు దీనిపై చాలా ఆశలున్నాయి.













