సీటీమార్ పోస్ట్ పోన్ కు అదే రీజనా..?
గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది డైరక్షన్ లో తెరకెక్కుతున్న సీటీమార్ సినిమాను ముందు నుంచి అనుకుంటున్నట్లుగా ఏప్రిల్ 2న రిలీజ్ చేయాల్సి ఉన్నా కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఏప్రిల్ 2న నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ఉన్న కారణంగా సీటీమార్ ను పోస్ట్ పోన్ చేశారనే వార్తలొచ్చాయి కానీ అసలు విషయమేంటంటే.. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. కబడ్డీ మ్యాచ్ లకు సంబంధించిన సీన్స్ లో వీఎఫెక్స్ షాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వర్క్ పెండింగ్ ఉండటం వల్లే రిలీజ్ పోస్ట్ పోన్ చేశారని తెలుస్తుంది.
ఏపీ మరియు తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్ లుగా గోపీచంద్, తమన్నాలు నటించిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా వీఎఫెక్స్ వర్క్ పెండింగ్ కారణంగా వాయిదా పడింది. రాబోయే వారాలు కూడా వరుస సినిమాలతో బుక్ అయ్యి ఉండటంతో సీటీమార్ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గోపీచంద్ కు ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కీలకం. అంతే కాదు ఇటు తమన్నాకు కూడా ఈ మధ్య ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతుండటంతో ఈ సినిమా తమన్నాకు కూడా కీలకంగా మారింది.













