ఎన్టీఆర్ 9999 నెంబర్ వెనుక అసలైన సీక్రెట్?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ కార్ కొన్నా సరే ఆ కారు నెంబర్ మాత్రం 9999నే ఉంటుంది. ఆయన కొన్న మొదటి కారు నుంచి ఇప్పటివరకు ఈ నెంబర్ లేని కారు ఎన్టీఆర్ కు లేదు. అది ఎంత కాస్ట్లీ కారైనా, చిన్న తరహా కారైనా సరే ఆ కారుకు 9999 నెంబర్ ఉండాల్సిందే. ఈ ఫ్యాన్సీ నెంబర్ తో కార్ ఇప్పటివరకు ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది. ఎన్టీఆర్ ఈ నెంబర్ ను ఎందుకు అంతలా ఇష్టపడతారో తెలుసా? తన తాతయ్య ఎన్టీఆర్‌కు అప్పట్లో ఇదే నెంబరున్న కార్లు ఉండేవట. ఈ కార్లన్నంటినీ నడిపేది జూ.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణనే. ఎన్టీఆర్ ఎక్కడికెళ్లాలన్నా హరికృష్ణనే డ్రైవింగ్ చేసేవాడు. పొలిటికల్ సమావేశాల్లో సైతం వేల మేళ్లు నడిపిన ఘనత హరికృష్ణకు ఉంది.
ఎన్టీఆర్ తర్వాత ఆ కార్లను హరికృష్ణ వాడేవారు. అలా సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలిద్దరిక 9999 నెంబర్ సెంటిమెంట్‌గా మారిపోయింది. వాళ్ల సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు జూ.ఎన్టీఆర్ కూడా అదే నెంబరున్న కార్లను వాడుతున్నాడు. అంతేకాదు తన లక్కీ నెంబర్ కూడా 9 కావడంతో ఆ సెంటిమెంట్‌ను అలాగే ఫాలో అవుతూ వస్తున్నాడట ఎన్టీఆర్.













