లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సుప్రీం షాక్
తెలుగు చలన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణను చేపట్టేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషనరు తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ తమ పిటిషన్‌ను అత్యసరంగా విచారణకు చేపట్టాలని అభ్యర్థించారు. దీనిపై చీఫ్‌జస్టిస్ రంజన్ గొగొయి సారథ్యంలోని ధర్మాసనం స్పందిస్తూ.. తగిన సమయంలో పిటిషన్ విచారణకు వస్తుందని సృష్టం చేసింది.













