అమెరికాకు సవ్యసాచి
గ్యాప్‌లేకుండా సినిమాలు చేస్తున్న నాగచైతన్య ఇప్పుడు మరో సినిమాను చివరి దశకు తీసుకొచ్చాడు. ఆ చిత్రమే సవ్యసాచి. చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చింది. ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నాడు చైతూ. ఈ డబ్బింగ్ పూర్తయిన వెంటనే అమెరికా షెడ్యూల్ ఫ్లాన్ చేశారు. మే 2 నుంచి 12 వరకు సవ్యసాచి యూఎస్ షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్లో కొన్ని సన్నివేశాలతో పాటు హీరోహీరోయిన్ల మద్య ఓ పాటను తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత కేవలం ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలుతుంది.
హైదరాబాద్‌లో 10 రోజుల్లో ప్యాచ్‌వర్క్ పూర్తిచేయబోతున్నారు. దీంతో మొత్తం సినిమా షూటింగ్ పూర్తవుతుంది. నాగార్జున నటించిన అల్లరి అల్లుడు సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ మూవీలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక చందుమొండేటి దర్శకత్వంలో చైతూ నటిస్తున్న రెండో సినిమా ఇది. యూఎస్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమా టీజర్‌ను విడుదల చేస్తారు. ఈ సినిమాలో మాధవన్, భూమిక కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు.













