న్యూయార్క్ లో సవ్యసాచి చివరి షెడ్యూల్
అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం సవ్యసాచి. నిధి అగర్వాల్ కథానాయిక. మాధవన్, భూమిక కీలక పాత్రధారులు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ న్యూయార్క్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ ప్రేమమ్ వంటి చక్కని ప్రేమకథ తర్వాత నాగచైతన్య, చందు కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. హై టెక్నికల్ వాల్యూస్‌తో దర్శకుడు మలుస్తున్న తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. చైతన్యకు అక్కగా భూమిక కీలక పాత్ర పోషిస్తున్నారు. 15 రోజుల పాటు న్యూయార్క్‌లో జరగనున్న షెడ్యూల్‌తో చిత్రీకరణ ముగుస్తుంది అని తెలిపారు.













