నవ్వులు పంచే సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి
హాస్యనటి శ్రీలక్ష్మి, నటుడు పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. అరవై ఏళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే భర్త ఉంటే ఎలా ఉంటుంది? అన్నది ఈ చిత్రం కథాంశం. ఇందులో సావిత్రిగా శ్రీలక్ష్మి నటించగా సత్యమూర్తిగా ఆమె భర్త పాత్రను పార్వతీశం పోషించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు నిర్మాత. ఆనంద్ డోల ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం : సత్య కశ్వప్.













