Satyaraj: ధనుష్ తో వర్క్ చేయడం కష్టం

ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తన సత్తా చాటుతున్నాడు తమిళ స్టార్ ధనుష్(Dhanush). ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇడ్లీ కడై(Idli kadai). తెలుగులో ఇడ్లీ కొట్టు(Idli kotu) అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఇడ్లీ కొట్టు సినిమాలో ప్రముఖ నటుడు సత్యరాజ్(Satyaraj) కీలక పాత్రలో నటించగా, రీసెంట్ గా ఆయన ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో ధనుష్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి(Baahubali) సినిమాలతో కట్టప్ప(Kattappa)గా దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ దక్కించుకున్న సత్యరాజ్ కు ఆ సినిమా తర్వాత భారీ గుర్తింపు రావడంతో ఎన్నో భాషల్లో అవకాశాలు దక్కి బిజీగా మారారు. తాజాగా సత్యారాజ్ ధనుష్ డైరెక్షన్ గురించి కామెంట్స్ చేశారు. రాజమౌళి, ధనుష్ ఇద్దరితో పోలిస్తే ధనుష్ తో వర్క్ చేయడమే కష్టమని ఆయన అన్నారు.
డైరెక్టర్ గా ధనుష్ కు చాలా క్లారిటీ ఉందని అతన్ని ప్రశంసించిన సత్యరాజ్, ఇడ్లీ కడై మూవీ ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పుకొచ్చారు. ఇటీవల ఎక్కువగా యాక్షన్ సినిమాలే వస్తున్నాయని, ఇడ్లీ కడై అలాంటి మూవీ కాదని, ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని ఆయన తెలిపారు. నిత్య మీనన్(Nithya Menon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.